![]() |
![]() |

మాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు వెర్సటైల్ స్టార్ ఫహద్ ఫాజిల్, టాలెంటెడ్ బ్యూటీ నజ్రీయా నజీమ్. అలాంటి ఈ ఇద్దరు మలయాళయేతర భాషల్లోనూ తమదైన ముద్రవేసే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే.. త్వరలో అటు ఫహద్, ఇటు నజ్రీయా కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రియల్ కపుల్ తాజా చిత్రాలు కేవలం వారం రోజుల వ్యవధిలో తెరపైకి రాబోతున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్ లో లోక నాయకుడు కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన చిత్రం `విక్రమ్`. ఇందులో ఫహద్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జూన్ 3న విడుదలకు సిద్ధమైంది. ప్రధానంగా తమిళంలో రూపొందిన ఈ సినిమా.. తెలుగులోనూ అనువాద రూపంలో సందడి చేయనుంది. కట్ చేస్తే.. `విక్రమ్` విడుదలైన వారం తరువాత అంటే జూన్ 10న ఫహద్ శ్రీమతి నజ్రీయా నటించిన ఫస్ట్ టాలీవుడ్ వెంచర్ రిలీజ్ కానుంది. ఆ చిత్రమే.. `అంటే.. సుందరానికీ!`. ఇందులో నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించాడు. మరి.. బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో రానున్న ఈ చిత్రాలతో మాలీవుడ్ జంట ఫహద్, నజ్రీయా.. ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
![]() |
![]() |